21-02-2026 12:00:00 AM
పాల్గొన్న ఎమ్మెల్యే, అధికారులు
మేడ్చల్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి ప్రతిపాదిత స్థలాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. అ ల్వాల్ బీహెచ్‌ఈఎల్ కాలనీ బిపి 4, వెంకటాపురం వద్ద రైల్వే గేట్ల వద్ద ప్రతిపాదిత ఆర్‌యూబీ నిర్మాణ అన్నలపై జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైల్వే వంతెనల పనులు పూర్తయితే మల్కాజ్గిరి నియోజకవర్గానికి రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కలుగుతుంది అన్నారు.
అంతేగాక ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నా రు. అలాగే మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ఆల్వాల్ ఐటెన్షన్ లైన్ డబుల్ రోడ్డు పనులను కూడా పరిశీలించారు. వివిఆర్ గార్డెన్స్ నుండి ఎస్‌ఎన్ రెడ్డి ఎంక్లేవ్ వరకు సుమారు నాలుగు కోట్ల మీటర్ల రోడ్డును రూ.4.5 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు గా విస్తరిస్తున్నారు. ఈ రోడ్డు కొంపల్లి లోని 44వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం కావడంతో ప్రజలకు రవాణా సౌక ర్యం మెరుగవుతుంది. ఈ కార్యక్రమంలో రై ల్వే, రెవెన్యూ, జలమండలి, విద్యుత్తు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.