25 July, 2026 | 11:14 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

25-07-2026 09:51 PM

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్లు, ఊటకుంటలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. జలసిరి, ఉపాధి హామీ పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.