ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- ‘నీట్’ ట్వీట్‌కు 30.3 కోట్ల వ్యూస్
- ‘ఫిఫా’ మ్యాచ్ రికార్డు బద్ధలు
న్యూఢిల్లీ, జూలై 25: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో నీట్‌ను ఉద్దేశించి అర్ధరాత్రి వేళ పోస్ట్ చేసిన వీడియో కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారి 30 కోట్లకు పైగా వ్యూస్‌తో ఫిఫా రికార్డును సైతం బ్రేక్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ఒక్కవీడియోతో ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 24 గంటల్లో 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు పెరగడమే గాకుండా 30.3 కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఇది ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం ‘ఐషో స్పీడ్’ వీడియో పేరిట ఉన్న 30 కోట్ల వ్యూస్ రికార్డును బ్రేక్ చేసింది.
ప్రస్తుతం ఇన్‌స్టాలో ప్రధాని మోదీకి 10.2 కోట్ల ఫాలోవర్లతో తొలి గ్లోబల్ లీడర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రధాని వీడియోలో ‘ఫ్రెండ్స్’ అంటూ జెన్ జీ (నేటి యువతరం) ఆశిస్తున్న తీరులో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు భారీ కామెంట్లు పెడుతున్నారు. వీడియోలో ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, జరిమానాలు, కేబినెట్ ఆమోదాలు తదితర అంశాలన్నింటినీ కూలంకషంగా నిజాయితీతో వివరించడం అందరినీ ఆకట్టుకుంది.






