దేశం గర్విస్తుంది
26-07-2026 12:18 AM
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల, యువత, ప్రజాస్వామ్యావాదుల విజయమని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాక్రోచ్ సైన్యాన్ని (సీజేపీ) చూసి దేశం గర్విస్తున్నదని, విద్యార్థులు, యువత ఆగ్రహించి పోరుబాట పడితే, అది ఏ స్థాయిలో ఉంటుందో యావత్ ప్రపంచం మరోసారి కళ్లారా చూసిందని పేర్కొన్నారు. ఇక ముందు ఎలాంటి పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ కాకుండా, అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వద్దిరాజు హితవు పలికారు.






