మంచి సినిమాలతో అభిమానులకు దగ్గరవుతా!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. పీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యువ కథానాయకుడు జయకృష్ణ విలేకరులతో పంచుకున్న సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
నటున్ని కావాలనుకున్నప్పట్నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ..
-నాకు చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. నా 16వ ఏట యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత శిక్షణ తీసుకో వడం మొదలుపెట్టా. రెండేళ్లు ముంబయిలో, తర్వాత పాండిచ్చేరిలో కొంతకాలం శిక్షణ తీసుకున్న తర్వాత న్యూయార్క్ వెళ్లాను. అక్కడ కూడా రెండు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నా.
తిరిగి వచ్చిన తర్వాత కథలు వినడం ప్రారంభించా. -ఈ సినిమా కోసం అజయ్ మూడు నెలల పాటు వర్క్‌షాప్ చేయించారు. లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, డైలాగ్స్ వంటి విషయాల్లో ముందుగానే సన్నద్ధమయ్యాం. నాకు యాక్షన్ చేయడం చాలా ఇష్టం. యాక్టర్ కావాలనుకున్నప్పుడే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నా.
శ్రీను పాత్ర.. అల్లరి పిల్లోడు..
-రాషా తడానీ ఈ సినిమాకు ఒక మంచి అసెట్. తనతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవాన్నిచ్చింది. మంగ పాత్రలో ఆమె పెర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు కచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నేను చేసిన శ్రీను పాత్రలో అల్లరి ఉంటుంది. తనకేం కావాలో తనకు స్పష్టంగా తెలుసు. మం గను ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రతిదీ పబ్లిక్ లోనే షూట్ చేశాం..
ఈ సినిమా కోసం 70 రోజుల పాటు అవుట్ డోర్ షూటింగ్ చేశాం. ప్రతిదీ పబ్లిక్‌లో నే షూట్ చేశాం. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నా. మోహన్‌బాబు వెరీ స్వీట్. చాలా క్లోజ్‌గా ఉంటా రు. కెమెరా ముందుకు వచ్చే సమయంలో మాత్రం చాలా ఏకాగ్రతతో ఉంటారు.
పాటలు దేనికవే ప్రత్యేకం..
-ఇందులో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. జీవీ ప్రకాశ్ ఇచ్చిన ఆరు పాటలు దేనికవే ప్రత్యేకం. అజయ్‌ను చాలా బాగా అర్థం చేసుకుని ఆయన సంగీతం సమకూర్చారు. అలాగే డాన్స్ నంబర్స్ కూడా చాలా బాగా వచ్చాయి.
తరచూ బుర్రిపాలెం వెళ్లాలని ఉంది..
ప్రమోషన్స్‌లో ప్రేక్షకుల స్పందన -చాలా అద్భుతంగా ఉంది. ఇందు లో భాగంగా బుర్రిపా లెం కూడా వెళ్లాను. ఇక పై తరచూ అక్కడికి వెళ్లి వాళ్లందరినీ కలవాలని ఉంది.
బాబాయ్‌లా అనిపించానేమో, కానీ..
టీజర్, ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాల్లో నేను మహేశ్‌బాబులా అనిపించాననే కామెంట్స్ వస్తున్నాయి. -కొన్ని షాట్స్‌లో అలా అనిపించొచ్చు. కానీ, సినిమా చూసినప్పుడు మాత్రం అలా అనిపించదు. క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది.
అజయ్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నా తొలి సినిమాకే అలాంటి క్లారిటీ ఉన్న దర్శకుడితో పనిచేయడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆయనతో తొలి సినిమా చేయడం నాకు చాలా లక్కీగా భావిస్తున్నా.
నాన్న, నేనూ ఆ విషయాలే మాట్లాడుకునేవాళ్లం..
నాన్న చాలా సినిమాలు చూసేవారు. మే ద్దరం సినిమాల గురించి చాలా మాట్లాడుకునేవాళ్లం. అయితే, -చిన్నప్పుడు నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి ‘నిజం’ సినిమా షూటింగ్‌కు వెళ్లా. అందులో చైల్డ్ క్యారెక్టర్ చేశా. ‘అర్జున్’, ‘గుంటూరు కారం’ సినిమా షూటింగులకూ వెళ్లా.
యాక్షన్ సినిమాలంటే ఇష్టం..
భవిష్యత్తులో అన్ని రకాల సినిమాలు చే యాలని ఉంది. అయితే వ్యక్తిగతంగా నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలని ఉంది.
బాబాయ్ పరిచయమైన బ్యానర్‌లోనే నేను కూడా..
అశ్వినీ దత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. బాబాయ్ తొలి సినిమా కూడా వైజయంతి మూవీస్‌లోనే వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన ఆదరణ ఈ సినిమాకు కూడా వస్తుందని ఆశిస్తున్నా.
అభిమానులకు నేనింకా ఏమీ ఇవ్వలేదు..
నేను ఈ సినిమా చేస్తున్నానని తెలియక ముందు నుంచే ఘట్టమనేని అభిమానులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదట్నుంచే ఉంది. ఈ విషయంలో ఒత్తిడి మంచిదే. అది నన్ను మంచి కథల వైపు, ప్రేక్షకులను, అభిమానులను అలరించే పాత్రల వైపు తీసుకెళ్తుంది. -నేను అభిమానులకు ఇంకా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. కచ్చితంగా మంచి సినిమాలు చేస్తూ, వాళ్లకు మరింత దగ్గరగా ఉండాలని భావిస్తున్నా.
బాబాయ్ మెసేజ్ పెట్టారు..
నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మహేశ్ బాబాయ్ ప్రతి విషయంలో సలహాలు ఇస్తారు. ఆయన ఈ సినిమా చూశారు కూడా. చాలా హ్యాపీగా ఫీలయ్యానంటూ నాకు మెసేజ్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సులు, సాంగ్స్ చాలా నచ్చాయని చెప్పారు. స్క్రీన్ మీద చాలా డిఫరెంట్‌గా ఉన్నానని, క్యారెక్టర్‌లోకి పూర్తిగా వెళ్లిపోయానని చెప్పారు.
ప్రేక్షకులు అసలు ఊహించలేరు..
-జెమినీ కిరణ్ ద్వారా ఈ ప్రాజెక్టు నా దగ్గరకు వచ్చింది. అజయ్‌ను ఆయనే పరిచయం చేశారు. ఇంతకుముందు కూడా నేను కొన్ని కథలు విన్నా. అజయ్ చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి ఎమోషన్, మంచి క్యారెక్టర్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నా. అలా అన్ని అంశాలు ఈ కథలో కుదిరాయి.
ఈ సినిమా వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది. క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రా రస్టిక్‌గా అనిపిస్తాయి. ఇది ఒకే టెంప్లేట్ లవ్ స్టోరీ కాదు. ఇందులో చాలా బలమైన భావోద్వేగాలుంటాయి. ట్విస్టులు కూడా చాలా కొత్తగా ఉం టాయి. కొన్ని సర్‌ప్రైజెస్ కూడా ఉన్నాయి. వాటిని ప్రేక్షకులు అసలు ఊహించలేరు.






