ప్రజల ముందు ఏ శక్తి నిలవదు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నీట్ పరీక్షా పత్రం లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పం దించారు. ట్విట్టర్ వేదికగా యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల శక్తి ముందు అధికారంలో ఉన్న వారి శక్తి నిలవదని ఆయన పేర్కొన్నారు.
జెన్- జీ యువతే దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా మారుతోందని, యువత గొంతును అణచి వేయడం సాధ్యం కాదని ట్వీట్‌లో పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రజాకాంక్షలు, యువత అభిప్రాయాలే చివరికి ప్రజాస్వామ్యంలో విజయం సాధిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో యువత, విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్ దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






