రాజీనామా పరిష్కారం కాదు
తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా న్ రాజీనామా చేసినంత మాత్రాన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ సంక్షోభానికి పూర్తి పరిష్కారం దొరికినట్లు కాదని కల్వకుంట్ల కవిత తెలిపారు. రాజీనామా అనేది వైఫల్యాన్ని అంగీకరించడమే తప్ప సంక్షోభానికి పరిష్కారం కాదని, నిజమైన జవాబుదారీతనా నికి వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఎక్స్ వేదికగా కవిత స్పందించారు.
యూపీఎస్సీ తరహాలోనే ఎన్టీ ఏకి కూడా చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తిని కల్పించాలని, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. జూలై 20న జరిగిన లాఠీఛార్జ్, పోలీసుల అరాచకత్వానికి బాధ్యులైన ప్రతి ఢిల్లీ పోలీస్ అధికారిని, ఆర్‌ఏఎఫ్ సిబ్బందిని, ప్రభుత్వ అధికారులను జవాబుదారీలను చేయాలని కవిత సూచించారు.






