25 July, 2026 | 11:14 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం

25-07-2026 10:01 PM

* మంత్రి ఉత్తమ్ సహకారంతోనే సాధ్యం

* ముత్తినేని వీరయ్య

గరిడేపల్లి,(విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో సార్ ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించినట్లు వికలాంగుల రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో శనివారం మండల పార్టీ అధ్యక్షులు త్రిపుర అంజన్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వీఆర్వో కిషోర్ నాతో సహా బాధ్యతలు చేపట్టామన్నారు. మంత్రిగా మరోపక్క మండలాలలో నిత్యం జూమ్ మీటింగులు ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణుల దిశా నిర్దేశించడం వలన దేశంలో ఎక్కడా లేనంతగా ఇంత పెద్ద సంఖ్యలో సర్ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగిందని అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి కారణమన్నారు.

మొత్తం 311 బూతులకు గాను 137 బూతులలో వందకు వంద శాతం పూర్తిగా చేసినట్లు తెలిపారు. మిగిలిన 174 బూతులలో ఒకటి రెండు మాత్రమే మిగిలిపోయాయని నియోజకవర్గ మొత్తంలో 1.96 మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. వీటిని కూడా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు. అందరూ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ అందరి సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా సమిష్టి కృషితో పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగేశ్వరరావు ఎంపిటిసి బాల్ దూరి సందీప్ ఎడవెల్లి ఉపేందర్ రెడ్డి, కొలిపాక లింగయ్య, బండారు అంజయ్య, సైదులు పలువురు పాల్గొన్నారు