ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం పట్ల కార్మికుల హర్షం
సమ్మెను విరమింపజేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనంద ఉత్సవాలు నిర్వహించిన కార్మికులు
సహకరించిన సంఘాలకు కృతజ్ఞతలు
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ సమ్మెను విరమింప చేసిన ప్రభుత్వా నీ కి ఆర్టీసీ కార్మికులు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించ్చేందుకు ప్రభుత్వం సుముకుత వ్యక్తం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు టాపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెకు సహకరించిన తీన్మార్ మల్లన్న పార్టీ ప్రతినిధులకు, బిజెపి నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, న్యాయవాదులకు, ఉపాధ్యాయ సంఘాలకు కృతజ్ఞతలు ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు.
గత మూడు రోజులుగా ఆదరణ సమ్మెలోని అంశాలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అర్ధరాత్రి పరిష్కరించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జేఏసీ నాయకులు రాజు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంకు కమిటీ వేసి అందులో ఆర్టీసీ యూనియన్ నాయకులకు కూడా సభ్యులు చేసి విలీన ప్రక్రియను వేవంతం చేస్తామని 2021 పే స్కేలు 11% కార్మికుల జీతాలు పెంచారు అని అన్నారు.
ఇప్పటివరకు ఆర్టీసీలో యూనియన్లు లేవు. యూనియన్ ఎలక్షన్ లో దొరుకుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం యజమాని ఓప్పుకుందన్నారు. ఆర్టీసీ డ్రైవర్ అమరుడైన శంకర్ గౌడ్ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, మూర్తి, రమేష్, ఖదీర్, శేఖర్, విడిదాస్, సీతారాం, ప్రేమ్ కుమార్, సంగారెడ్డి, బాలా గౌడ్, లింగం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






