26 April, 2026 | 3:08 PM

మంత్రి పొన్నంని సత్కరించిన ఆర్టీసీ జేఎసి నేతలు

26-04-2026 01:39 PM

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం నిర్వహించిన చర్చలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ జేఎసి నేతలు సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేర్చిందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ, ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి,హనుమంతు ముదిరాజ్ ,ఇతర సంఘాల నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ప్రజా రవాణాను మరింత బలపరిచేలా ఉత్సాహంతో కార్మికులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.