22 July, 2026 | 3:40 AM

కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ

22-07-2026 12:00 AM

ప్లాట్ ఫామ్ నుంచి ఎత్తుకెళ్లిన అగంతకుడు

కోరుట్ల జులై 2౧ (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్‌ను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే కోరుట్ల బస్సు టీఎస్8 జడ్ 0103నంబర్ గల బస్‌ని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. విషయం తెలిసిన ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ బస్సు నిజామాబాద్ వైపు వెళ్లిందని తెలియడంతో కోరుట్ల మెట్‌పల్లి పోలీసులు అప్రమత్తమై ఆ మార్గంలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ దేవాలయం వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టి ఉండడం గమనించి పోలీసులు బస్‌ని స్వాధీనం చేసుకొని నిందితుడు కందుల సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. ఆర్టీసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.