నేడు ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జిగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. ఈమేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్, వికారాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, ఖమ్మం, జగిత్యాల, మహబూబాబాద్, వనపర్తి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మిగలిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి.






