పెద్దమల్లారెడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
23-05-2026 02:06 AM
భిక్కనూర్, మే22(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మెదక్ జిల్లా నందిగామకు చెందిన వీరబోయిన కార్తీక్ (25) ఇస్సానగర్ నుంచి తిరిగి వస్తుండగా పెద్దమల్లారెడ్డిఇస్సన్నపల్లి మూలమలుపు వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది.






