నార్సింగి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం
ట్రీ పాత్‌ను ఢీకొని వ్యక్తి మృతి
రాజేంద్రన గర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సయ్యద్ సమద్ మృతి చెందాడు. గ్రోసరీ సరుకుల డెలివరీ కోసం హోండా షైన్ (టీ ఎస్ 13 ఈ పి 8085)పై నార్సింగి నుంచి గండిపేట వైపు వెళ్తుండగా నార్సింగి బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.
డివైడ్ప ఉన్న ట్రీపాత్ ను ఢీకొన్న అనంతరం అదే సమయంలో ఎదురుగా వస్తున్న టాటా ఈవీ (టి ఎస్ 07 జె టి 8599) ఢీకొనడంతో సమద్కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు లంగర్హౌస్లోని రెనోవా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సయ్యద్ సాదత్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వాహనాలను పరిశీలిస్తున్నారు.






