29 August, 2026 | 3:20 AM

వెలిజర్ల పోచమ్మ గుడికి ఎమ్మెల్యే వీర్లపల్లి రూ.51వేల విరాళం

29-08-2026 12:43 AM

షాద్‌నగర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఫరూఖ్నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో జరుగుతున్న పోచమ్మ దేవాలయ నిర్మాణ పనులకు ఈరోజు షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ 50000 (యాబై ఒక్క వెయ్యి రూపాయలు) విరాళం  అందించారు. ఈ విరాళాన్ని  స్థానిక సర్పంచ్ ఆర్ బాబు నాయక్, గ్రామ నాయకులు జాంగారి రవి, జాం గారి జంగయ్య కు అందజేశారు ఈసందర్భంగా ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ మాట్లాడుతూ వెల్ జర్ల గ్రామంలో నిర్మిస్తున్న పోచమ్మ గుడికి తన వంతుగా సహాయం చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అండగా నిలుస్తూ ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు అలాగే ఈనెల 30 వ తేదీన జరిగే పోచమ్మ గుడి ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తా అని అన్నారు ఈ కార్యక్రమం లో  వెల్‌జర్ల సర్పంచ్ ఆర్ బాబు నాయక్, గ్రామ నేతలు, జాంగారి జంగయ్య,జాంగారి రవి తదితరులు పాల్గొన్నారు.