15 June, 2026 | 5:52 PM

జయవరం వద్ద రోడ్డు ప్రమాదం

15-06-2026 04:36 PM

రేకుర్తి యువకుడు అక్కడికక్కడే మృతి

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి గ్రామానికి చెందిన దానే రమేశ్ (30) తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో  వేములవాడ శివారులోని జయవరం వద్ద అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రమేశ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.