ఘనంగా వాసవి మాతకు పూజలు
07-08-2026 06:28 PM
మేళ్లచెరువు,(విజయక్రాంతి): మేళ్లచెరువులోని వాసవిభవన్లో మేళ్లచెరువు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాతకు శుక్రవారం ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఒడిబియ్యం పోయుట, సారే సమర్పించుట, మొదలగు పూజాది కార్యక్రమాలు అత్యంత ఘనంగా కన్నుల పండుగ లా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వరగాని నాగరాజు,ప్రధాన కార్యదర్శి కొప్పురావురి విజయ శంకర్, కోశాధికారి విడాల పురుషోత్తం, వర్కింగ్ ప్రెసిడెంట్ తూములూరి ఆదిత్య తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






