నితిన్‌కు జోడీగా రితిక?
హీరో నితిన్ ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయ కుడుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్క నుంది. ఈ ప్రాజెక్టును మేకర్స్ ఇటీవల నితిన్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రానికి ఎవరు దర్శ కత్వం వహించబోతున్నారనే విషయమై స్పష్టత రాలేదు. ఇదిలావుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో యువ కథానాయకి రితికా నాయక్ హీరోయిన్‌గా నటించబోతోందనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదించగా, ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘మిరాయ్’ సినిమాలో కథానాయికగా నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో వరుణ్ తేజ్‌తో కలిసి నటిస్తోంది. ఇప్పుడు నితిన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు సంబంధించిన పలు వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.






