21 April, 2026 | 9:48 PM

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏకగ్రీవం

21-04-2026 08:39 PM

అధ్యక్షునిగా అన్నమనేని

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పాలకవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2026-28 నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ముగ్గురు, 15 కార్యవర్గ స్థానాలకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా మంగళవారం ఏకాబిప్రాయం తో ఏకగ్రీవం చేశారు. గత పాలకవర్గంలో జిల్లా ప్రధాన కార్య దర్శిగా ఉన్న తొడుపునూరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నమనేని సుధాకర్ రావు,

కె వెంకటయ్యలు అధ్యక్ష స్థానం కోసం నామినేషన్ దాఖలు చేయగా ఇద్దరు పోటినుండి తప్పుకోవడం తో అన్నామనేని సుధాకర్ రావు అధ్యక్షణినిగా ఎన్నికయ్యారు. 15 కార్య వర్గ స్థానాలకు 31 మంది నామినేషన్లు దాఖలు చేయగా 16 మంది తప్పకోవడంతో 15 మంది  టి.అశోక్ రావు, టి శివ, బుక్క శ్రీనివాస్, బోనగిరి కిరణ్, కె మల్లికార్జున్, బి.తిరుపతి,  సిహెచ్ ఐలయ్య, క్యాస ఉపేందర్, పి సదానందం, పి మల్లారెడ్డి, పి విజయేందర్ రెడ్డి,కె .కేశవరెడ్డి, మల్లన్న,  వీరకుమార్, ఎం జితేందర్లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు అని ఎన్నికల అధికారి పీవీ రామకృష్ణ ప్రకటించారు.