2 September, 2026 | 10:27 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలి

29-06-2026 | 06:37pm

* గాదిగూడ మండల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశం..

గాదిగూడ,(విజయక్రాంతి): గాదిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో కొమరం భీం ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సోమవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఎల్‌ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి అర్హులైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియలో ప్రజలకు సహకరించాలని సూచించారు.అనంతరం బీఎల్‌ఏలకు అవసరమైన ఎస్‌ఐఆర్ మెటీరియల్ తో పాటు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా కృషి చేయాలని సుగుణక్క పిలుపునిచ్చారు.