3 September, 2026 | 2:22 AM

మాజీ ఎంపీ రాథోడ్ సేవలను మర్చిపోలేం

29-06-2026 | 06:47pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పార్లమెంట్  నియోజకవర్గం  మాజీ ఎంపీ  రాథోడ్ రమేష్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అందించిన సేవలను ప్రజలు నేటికీ  మరిచిపోలేదని  బిజెపి నాయకులు, ఆయన అభిమానులు అన్నారు. ఆయన రెండో వర్ధంతి సందర్భంగా  సోమవారం ఉట్నూర్ మండలం నాగపూర్  గ్రామ శివారులోని  వ్యవసాయ క్షేత్రంలోని  ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు, నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రితేష్ రాథోడ్  మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా, జెడ్పి చైర్మన్, ఎంపీగా పదవులు నిర్వహించి  ఉమ్మడి జిల్లా ప్రజలలో సముచిత స్థానం సాధించిన  రాథోడ్ రమేష్ ను  నేటికీ ప్రజలు మర్చిపోవడం లేదని  అన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు నేటికీ గ్రామాల్లో సజీవంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలను ప్రజలు మరిచిపోలేదని  ఆయన అభిమానులు ఆయన సేవలను కొనియాడారు. పుట్లూరు మండలం తో పాటు   ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాలలో  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.