2 September, 2026 | 8:54 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఏజెన్సీలో వట సావిత్రి వ్రత పూజలు

29-06-2026 | 06:28pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీలోని  గిరిజన గ్రామాల్లో  ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని  మహిళలు మర్రి చెట్ల వద్ద  వట సావిత్రి పూజలను చేశారు. సోమవారం ఉదయం ఉట్నూర్ మండల కేంద్రంతో పాటు  గ్రామాల్లోని మహిళలు మర్రి చెట్లకు వద్దకు వెళ్లి  తమ మాంగల్యం  కలకాలం భద్రంగా ఉండాలంటూ.. ప్రత్యేక పూజలు చేసి మర్రి చెట్టుకు దారాలతో ప్రదక్షిణలు చేశారు. ఉట్నూర్ మండలం తో పాటు  ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.