వశిష్ట విద్యా సంస్థ ఫిర్యాదు
29-06-2026 06:44 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వశిష్ట విద్యా సంస్థపై బెస్ట్ అవైలబుల్ స్కూల్ తల్లిదండ్రులు దళిత సంఘాల నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎంపిక చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించిన ఆ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని దీనివల్ల విద్యార్థులు ఆ పాఠశాలలో ఉండలేకపోతున్నారని కలెక్టర్కు విన్నవించారు.
భోజనం ఇతర వసతి సౌకర్యాలు విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వెంటనే పాఠశాలకు చర్య తీసుకోవాలని లేదా విద్యార్థుల నుంచి వేరే పాఠశాలకు మార్చాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంజిత్ కుమార్, ఎల్లయ్య రవీందర్ వినోద్ తదితరులు ఉన్నారు.






