21 April, 2026 | 10:05 PM

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి విరమణ సహజం

21-04-2026 08:37 PM

* మండల విద్యాధికారి నీరజ

చేగుంట,(విజయక్రాంతి): ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని చేగుంట మండల విద్యాధికారి నీరజ  అన్నారు. మండల పరిధి లోని చిన్న శివనూర్ పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా గా పనిచేసిన  బత్తుల రాములు మంగళవారం రిటైర్డ్ అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి తో కలిసి వారు మాట్లాడుతూ. పాఠశాలలో విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతూ, వారి ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకునేలా చేసిన బత్తుల రాములు కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన శేషజీవితం ప్రశాంతమైన వాతావరణంలో గడవాలని, ఆయూరారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి స్వామి గౌడ్, ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్,చేగుంట మండల పిఆర్టియు టి ఎస్ అధ్యక్షులు గజగట్ల నాగరాజు, టీఆర్టిఎఫ్ అధ్యక్షులు జగన్ లాల్, యూటీఎఫ్ అధ్యక్షులు బాలపోచయ్య, ఎస్టియు ప్రధానకార్యదర్శి మనోహర్,  తపస్ అధ్యక్షులు వెంకటేష్,టిపిటీఫ్ అధ్యక్షులు నర్సింగ రావు,ఎస్జీటీయూ అధ్యక్షులు గొర్రె మల్లిఖార్జున్,రాష్ట్ర నాయకులు వెంకట్రామిరెడ్డి,ప్రభాకర్, పిన్నం శ్రీనివాస్,శంకర్, కొండల్ రెడ్డి, విఠల్ రెడ్డి, వరాల నర్సింలు, చల్లా లక్ష్మణ్ ,జిల్లా నాయకులు చల్లా రామకృష్ణ, పాండు,నగేష్, రాజశేఖర్,తిరుపతి,కృష్ణమూర్తి, గోపాల్, వివిధ గ్రామాల ఉపాధ్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.