10 May, 2026 | 7:00 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కిస్మత్‌పురలో చక చకా బియ్యం పంపిణీ

01-03-2026 12:00 AM

212 రేషన్ దుకాణాలకు గాను 105 షాపులకు చేరిన సన్న బియ్యం

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్ పుర ఎంఎల్‌ఎస్ పాయింట్ నుండి రేషన్ దుకాణాలకు చక చక సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కిస్మత్ పుర ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలోని గండిపేట, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, రిలింగంపల్లి మండలాల్లోని 212 రేషన్ దుకాణాలకు సకాలంలో సన్న బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఈనెల 26న విజయక్రాంతి దినపత్రికలో ‘ పేదోడి కోడుపుకోతున్న నిర్లక్ష్యం‘ అనే కథనం ప్రచురితమైంది.

అందుకు స్పందించిన రంగా రెడ్డి జిల్లా జెసి చంద్ర రెడ్డి. డి ఎస్ ఓ లు వెంటనే కిస్మత్ పుర ఎం ఎల్ ఎస్ పాయింట్ లోని ఇంచార్జి భార్గవరెడ్డి. మురళికృష్ణతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని వెటనే స్టేజి 1 నుండి బియ్యం తెప్పించుకొని స్టేజి 2 ద్వారా రేషన్ దుకాణాలకు సన్న బియ్యం చేరవేయాలని ఆదేశించడంతో గత రెండు రోజుల నుండి కిస్మత్ పుర సివిల్ సప్లై గోదాం నుండి  చకచకా సన్న బియ్యం రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు గోదాం 2 ఇంచార్జీ మురళి కృష్ణ తెలిపారు.

రాజేంద్ర నగర్. శేరిలింగంపల్లి పరిధిలోనీ 113 రేషన్ షాపులకు గాను 70 షాపులకు బియ్యం సరఫరా చేశామని. మురళి కృష్ణ తెలిపారు 1 గోదాం పరిధిలోని 99 షాపులకు గాను 30 రేషన్ దుకాణాలకు పూర్తి స్థాయిలో సరఫరా చేసినట్లు డాటా ఎంట్రీ ఆపరేటర్ నవీన్ తెలిపారు. మిగతా షాపులకు 2 రోజుల్లో పూర్తిగా  పంపిస్తాం అని వారు తెలిపారు.