ఫుడ్ స్టోరేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నేరేడుచర్ల,జూలై 23(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో గురువారం 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే ఫుడ్ స్టోరేజ్ (ఆహార నిల్వ) భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ భవన నిర్మాణంతో ఆహార పదార్ధాలు నిల్వ చేసుకొని, భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పారేపల్లి సత్యనారాయణ, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి, ఎంపీవో నాగరాజు, ఏఈ కళ్యాణ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు, మాజీ చైర్మన్ ప్రకాష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఏపీఎం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్టా కృష్ణారావు, ఉప సర్పంచ్ పెద్ది సైదులు, వీవో అధ్యక్షురాలు కవిత, వీవోఏ ఝాన్సీతో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు, రాములు, ముక్కంటి, రాజీవ్, రాకేష్, సురేష్, మల్లయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.






