23 July, 2026 | 5:58 PM

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

23-07-2026 05:07 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) పరువునష్టం కేసు లీగల్ నోటీసులు పంపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడారని సీఎంపై కేటీఆర్ పరువునష్టం పిటిషన్ వేశారు. గ్లోబరీనా సంస్థపై రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి రుజువు చేయాలి.. లేదంటే 48 గంటల్లో క్షమాపణ చెప్పారని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్లోబరీనా తన బినామీ అయితే.. ఈ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?అని ప్రశ్నించారు. రాజ్ భవన్ ముందు చేయాల్సిన ధర్నా కొడంగల్ లో చేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ తో.. రాత్రి బీజేపీతో ఉంటారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఒక మూట.. బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై తాను సీఐడీ విచారణకు సిద్ధమని కేటీఆర్ సీఎం కు సవాల్ విసిరారు.