10 May, 2026 | 8:11 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

చేతివృత్తి కళాకారుల జీవితాల్లో కొత్త వెలుగులు

01-03-2026 12:00 AM

కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్, ఫిబ్రవరి28 (విజయక్రాంతి): ప్రతి యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి)ఆధ్వర్యంలో నిరుద్యోగ యువ తకు శిక్షణ, ఆధునిక యంత్రాలు, మరియు టూల్-కిట్స్ పంపిణీ  కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా కెవిఐసి చైర్మన్ మనోజ్ కుమా ర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మనమంతా కలిసి ఆత్మనిర్భర భారత సాధనతో వికసిత్ భారత్ 2047’ నిర్మాణంలో భాగస్వాములం అవు దాం. వందేమాతరం గీతానికి 150వ సంవత్సరంలో మనం ఉన్నాం. ప్రతి యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా,ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని తెలియ జేశారు. నగరాలు, పట్టణాల్లో ఉండే కనీస సౌకర్యాలు గ్రామాలకు కూడా అందాలి. మనమంతా కలిసి పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.

మన ప్రియతమ ప్రధాన మంత్రి మోదీ ఆలోచనల మేరకు, మన గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి,మన చేతివృత్తి కళాకారులను గౌరవించుకుంటూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి,ఆత్మ నిర్భర భారత్ నిర్మాణానికి బలమైన అడుగులను వేసేందుకు మనమంతా సమావేశమయ్యాం అని కిషన్ రెడ్డి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు శిక్షణ అందించి,ఈ మూడేళ్లలో వీటి ద్వారా దాదాపు 1800 మందికి లబ్ధి చేకూరింది.కుండలు, ఇతర మట్టివస్తువుల తయా రీకి ఎలక్ట్రిక్ చక్రాలు, అగరబత్తి యంత్రాలు, కుట్టు యంత్రాలు, మొబైల్ రిపేరింగ్ కిట్లు, పాదరక్షాల తయారీ అవసరమైన పరికరాలు, (టూల్ కిట్స్) కిషన్ రెడ్డి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేశారు.