23 July, 2026 | 6:16 PM

బోధన్‌ పట్టణంలో బీజేపీ ధర్నా, రాస్తారోకో

23-07-2026 05:14 PM

బోధన్, జూలై 23, (విజయక్రాంతి): దేశ పార్లమెంట్‌పై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోక నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు శాంతియుతంగా జరగాలని, హింసాత్మక ఘటనలు సమర్థనీయం కాదని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, మాజీ కౌన్సిలర్లు గొడుగు ధర్మపురి, మాసిని వినోద్, మీర్జాపూర్ అరవింద్, గాదె సందీప్, దేవకాటే శివరాజ్, ఏనుగంటి గౌతమ్ గౌడ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.