23 July, 2026 | 6:43 PM

పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి

23-07-2026 05:38 PM

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోకలెక్టరేట్ ఎదుట ధర్నా

భూపాలపల్లి టౌన్,జూలై 23 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు ప్రవీణ్ మాట్లాడుతూ, నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, ప్రతి హాస్టల్‌కు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేరెళ్ల జొసప్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ జడల రాజేశ్వరి, పోతుల పవన్, ఉల్లేరావు బన్నీ, రాజుల శివ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.