గూడెం గ్రామ యువకుడికి డాక్టరేట్
23-07-2026 05:09 PM
బెజ్జంకి,జూలై 23: బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన బోనాల మొండయ్య–ఎల్లవ్వ దంపతుల కుమారుడు బోనాల అనిల్ శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరుపై పరిశోధన పూర్తి చేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) డిగ్రీకి అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాల వాణిజ్యశాస్త్ర విభాగంలో పార్ట్‌టైమ్ అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, గ్రామస్థులు ఆయనను అభినందిస్తూ, గూడెం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.






