23 July, 2026 | 5:56 PM

బోధన్ పట్టణంలో నకిలీ నోట్ల కలకలం..!

23-07-2026 05:22 PM

బోధన్ (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో నకిలీ నోట్లు కలకలం  సృష్టిస్తున్నాయి. కిరాణా షాపులు, మద్యం దుకాణాలలో వీటి మార్పిడి జోరుగా జరుగుతుంది. 100, 200 చాలామణిలో ఉన్నట్లు తెలుస్తుంది. మద్యం  దుకాణాలలో వీటి మార్పిడి జరుపుతున్నట్లు వెలుగు లోకి వచ్చింది. బుధవారం మద్యం కొనుగోళ్లు కు వచ్చిన వ్యక్తులు నకిలీ నోట్ల ద్వారా మద్యం కొనుగోలు చేశారు. పూర్తిగా అసలు నోట్ల ను పోలి ఉండటం తో వీటిని గుర్తించడం ఇబ్బందిగా మారింది. నకిలీ నోట్లు చేతులు మారడం తో వ్యాపారులలో  కలకలం చెలరేగింది. చిన్న చిన్న కొనుగోళ్లు జరిగే సమయం లో వీటి మార్పిడి  సులువుగా మారుతుంది. ఖాళీ సమయాలలో కౌంటర్ లలో ఉన్న నగదు  లెక్కించు కునే సమయం లో నకిలీ నోట్లను వ్యాపారాలు గమనిస్తున్నారు.