దోస్త్ ప్రవేశాలకు చివరి అవకాశం
23-07-2026 05:08 PM
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ రమణారావు
భూపాలపల్లి టౌన్, జులై 23 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వ కమిషనర్ ఆఫ్ కాలేజెస్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు దోస్త్ స్పెషల్ ఫేస్ అడ్మిషన్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూపాలపల్లిలో జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ రమణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూపాలపల్లిలో బీఎ, బీకాం, బీఎస్సీ కోర్సులలో అవకాశం కలదని, ఈనెల 26వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని, వెబ్ ఆప్షన్లకు 27వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. రెగ్యులర్ విధానంలో డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డిగ్రీలో ప్రవేశం పొందగలరని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కోరారు.






