27 July, 2026 | 4:01 AM

ఎమ్మెల్యే సామేల్‌పై తిరుగుబాటు

27-07-2026 12:00 AM
  1. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు క్షమాపణ చెప్పాలి
  2. నిన్ను కులం పేరుతో దూషించినా, ప్రొటోకాల్ అవమానం కలిగినా మేమే కొట్లాడుతాం
  3. చావు డప్పులు కొడతామని హెచ్చరించడం నీకు తగదు
  4. న్యాయవాది, పీసీసీ నేత పర్రె పాటి యుగంధర్

సూర్యాపేట, జులై 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రి పదవిని వదిలి, పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలేనని, వారం రోజుల్లో ఎమ్మెల్యే సామేలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పర్రేపాటి యుగంధర్ డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో నీకేమైనా పంచాయితీలుంటే, పీసీసీ అధ్యక్షుడు, సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప,, అధికార పార్టీ ఎమ్మెల్యేవై ఉండి మెంటల్ పదాలతో దూషించడం సిగ్గు చేటని విమర్శించారు. నిన్ను కులం పేరుతో దూషించిన, నీకు ప్రొటోకాల్ అవమానం కలిగిన, మేమంతా కొట్లాడుతామని చెప్పారు.

అంతేగాని, వారికి వీరికి చావు డప్పులు కొడతామని, హెచ్చరించడం నీకు తగదని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నేతల కుటుంబాలకు అండగా ఉన్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి కుమారుని పోగొట్టుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకులను నా కుటుంబంగా భావించి, సేవ లు చేస్తుండడం కొనియాడారు. జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే మనసు మార్చుకుని, వారం రోజుల్లో బే షరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే గాంధీభవన్ వద్ద, సూసైడ్ చేసుకుంటామని హెచ్చరించారు.

సంగేం సర్పంచ్ కలకోట్ల మల్లేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఎమ్మెల్యే సామేలు చేస్తున్న ఆగడాలకు, రాష్ట్ర అధిష్టానం అడ్డుకట్ట వేయాలని, అవసరమైతే చట్టపరంగా 192 ఆర్టికల్ ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కందుకూరి అంబేద్కర్, పంది శ్రీనివాస్, ఆకారపు శ్రీను, సుదర్శన్, గాజుల వీర య్య తదితరులు పాల్గొన్నారు. కాగా తమపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేసినట్లు ఎంపీ చామల వర్గానికి చెందిన అడ్వకేట్ పర్రెపాటి యుగంధర్, కందకూరి అంబేద్కర్  ఎస్‌పీకి ఫిర్యాదు చేశారు.