27 July, 2026 | 4:44 AM

ఆగస్టు 15లోపు ఫీజు బకాయిలు విడుదల చేయాలి

27-07-2026 12:00 AM
  1. లేదంటే సచివాలయాన్ని ముందు ధర్నా చేస్తాం
  2. టీఎస్‌టీసీఈఏ అధ్యక్షుడు సంతోష్
  3. సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్‌కు మెయిల్ 

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఆగస్టు 15వ తేదీ లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, లేదంటే ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉద్యోగ సం ఘాలు, కుల సంఘాలతో కలిపి ధర్నాకు దిగుతామని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం మెయిల్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి, సీఎస్‌కు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు వినతిపత్రం పంపించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు , ఉద్యోగుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని, దాదాపు రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. వాటిని విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని కళాశాలలు ఉద్యోగులకు పర్సంటేజ్ జీతాలను చెల్లిస్తున్నాయని, దీంతో వారి కుటుంబాలు నడవడం భారంగా మారిపోయిందని పేర్కొన్నారు.