5 August, 2026 | 1:52 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి సమీక్ష

05-08-2026 01:10 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జోన్లో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతికి ప్రాధాన్యం ఇస్తూ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి ఐఏఎస్ మంగళవారం జోనల్ కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు.సర్కిల్ స్థాయి సమస్యలు, పెండింగ్ ఫైళ్లు, రోడ్లు,డ్రైనేజీలు, బిల్ నౌ అనుమతులు, పార్కుల నిర్వహణ, దోమల నివారణకు ఫాగింగ్ వంటి అంశాలపై చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు, సిటీ ప్లానర్, ఆరోగ్య, ఫైనాన్స్ అధికారులు పాల్గొన్నారు.