5 August, 2026 | 1:52 AM

అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

05-08-2026 01:11 AM

ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్ పల్లి, ఆగస్టు 04,( విజయ క్రాంతి): కాలనీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రజల సహకారం, సంఘాల భాగస్వామ్యం ఎంతో అవసరమని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధి దిల్ కుష్ నగర్ లో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ప్లాన్, లేఅవుట్ సైన్ బోర్డులను మంగళవారం మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్ కుష్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్న అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మంచినీటి సరఫరా లో ప్రెషర్ తక్కువగా వస్తుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సూచించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు మందడి సుధాకర్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాజా, దిల్ కుష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ హుస్సేన్, అసోసియేషన్ సభ్యులు మొహమ్మద్ జమీల్, ఆంజనేయులు గౌడ్, రాజ్ కుమార్, ముక్తార్, మహమ్మద్ ఫయాజ్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.