ఆయిల్ పామ్‌తో రైతులకు సిరులు
- 60వేల మె.ట. క్రషింగ్ పూర్తి చేయడం అద్భుతం
- మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి
- సిద్ధిపేటలో నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సందర్శన
నంగునూరు, ఆగస్టు 22 (విజయక్రాం తి): కాళేశ్వరం జలాలతో సిద్దిపేట ప్రాంతం లో ఆయిల్ పామ్ సాగుకు సరికొత్త నాంది పలికిందని, దీంతో రైతులకు మంచి ఆదా యం సమకూరుతోందని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అ న్నారు. శనివారం సిద్దిపేట నియోజకవర్గంలోని నర్మేట ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణమంతా కలియతిరిగి, పామాయిల్ తయారీ విధానాన్ని ప్రశాంత్ రెడ్డికి హరీష్ రావు వివరించారు.
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు పొందుతున్న రైతుల ఆనందం చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉందని సంతో షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ అనతికాలంలోనే 60 వేల మెట్రిక్ టన్నుల క్రషింగ్ పూర్తి చేయడం అద్భుతమన్నారు. రిఫైనరీ కూడా ఏర్పాటు చేయనున్నామని, ఆ పనులను వెంటనే ప్రారంభించాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు.
ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన మొక్కలు నర్సరీల్లో తగినన్ని అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగుకు ముం దుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, క్రషింగ్ కోసం వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఆయన వెంట మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అనుకోని లింగంగౌడ్, సర్ప ంచ్ శనిగరం స్వాతి బాబు, పీఏసీఎస్ చైర్మ న్లు రమేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, నాయకు లు సోమిరెడ్డి, బెదురు తిరుపతి, బద్దిపడగ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.






