14 August, 2026 | 5:22 AM

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై పరిశీలన

14-08-2026 12:01 AM

పెబ్బేరు, ఆగస్టు 13: ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం పెబ్బేరు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను గడువులోగా పూర్తి చేసి, ఎలాంటి జాప్యం లేకుండా వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఫెన్సింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.