15 June, 2026 | 10:54 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

19-01-2026 12:00 AM

ఖమ్మం టౌన్, జనవరి 18 (విజయక్రాంతి): అచ్చమైన తెలంగాణ ఇంటి వంటల రుచులు& ఆత్మీయ ఆతిథ్యం& సంప్రదాయ పరిమళం& ఇవన్నీ కలిసిన ప్రత్యేక విందు ఖమ్మంలో జరిగింది. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఘనమైన తెలంగాణ వంటకాల విందు ఏర్పాటు చేశారు.

సీఎం ఫిదా

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆహ్వానంతో ఏర్పాటు చేసిన ఈ విందులో స్వచ్ఛమైన తెలంగాణ రుచికి సీఎం రేవంత్ రెడ్డి ఫిదా అయ్యారు. భోజనం అదిరింది& ఆతిథ్యం మెరిసింది అన్నట్టుగా సాగిన ఈ విందులో తెలంగాణ నేటివిటీ ప్రతి వంటకంలో ఉట్టిపడింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు, ఇతర ముఖ్యులు విందుకు హాజరయ్యారు.

ఇది పక్కా తెలంగాణ ఇంటి వంట రుచి అని పేర్కొన్నారు. తెలంగాణ స్టైల్లో వండిన ఘాటైన నాటుకోడి పులుసు&నోరూరించే రొయ్యల ఇగురు&చేపల కూర& అదిరిపోయే మటన్ ఫ్రై&ప్రత్యేక రుచితో చేసిన మటన్ కీమా రుచి చూసిన సీఎం వాటిని ఇష్టంగా ఆరగించారు. దాదాపుగా 17 రకాల నోరూరించే వంటకాలతో సీఎంకు రాజభోజనం వడ్డించారు. 

వంటింటిని పర్యవేక్షించిన మంత్రి సతీమణి మాధురి

ఈ విందులో మంత్రి సతీమణి పొంగులేటి మాధురి ప్రతి వంటకం సంప్రదాయ రుచులు తగ్గకుండా ఉండేలా స్వయంగా పర్యవేక్షించి తయారు చేయించారు.

మాంసాహారం.. శాఖాహారం రెండూ విశేషమే

మాంసాహారంతో పాటు వేడివేడి జొన్న రొట్టెలు, రుచికరమైన వెజ్ పలావ్, క్యారెట్‌కొబ్బరి ఇగురు, పచ్చిమిర్చి పచ్చడి వంటి శాఖాహార వంటకాలు కూడా సీఎంను విశేషంగా ఆకట్టుకున్నాయి.

శాలువా సత్కారం...హస్తకళా బహుమతి

భోజనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, హస్తకళా పెయింటింగ్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి బహూకరించారు.