రేవంత్‌రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్!
- సీఎంగా, హోమంత్రిగా ఉన్నా రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు
- ఐపీఎస్ అధికారిని భార్య హత్య, సీపీ సుమతి ఆపరేషన్‌తో బట్టబయలైన భద్రత
- మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, సీఎంగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు శుక్రవారం ప్రకటనలో విమర్శించారు. 2024 ఎన్సీఆర్బీ గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థి తి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బయటపెట్టాయని తెలిపారు.
2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయన్నారు. 2024 లో తెలంగాణలో 25,500 మంది మిస్సింగ్ కేసులు నమోదవగా, వారిలో వేలాదిమం ది ఇప్పటికీ ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో రా ష్ట్రం లో చిన్నారులపై 6,767 కేసులు నమోదయ్యాయని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారు ల్లో అధిక శాతం బాలికలేనని చెప్పారు. మహిళలపై నేరాలు పెరిగాయని, 2022లో 22,066 కేసులు ఉండగా 2024లో అవి 24,495 కు పెరిగాయని పేర్కొన్నారు.
2024లో 423 మా నవ అక్రమ రవాణా కేసులు నమోదు కావ డం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ఐఏఎస్ క్వార్టర్స్‌లో ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటనలు రాష్ట్రంలో క్షీ ణించిన శాంతి భద్రలకు నిదర్శనమని మండిపడ్డారు. సీపీ సుమతి నిర్వహించిన ఆపరేషన్‌తో హైదరాబాద్‌లో మహిళల భద్రత ఎంత డొల్లగా మారిందో బయటపడిందని తెలిపారు.
రైతులతో కాళ్లు మొక్కిస్తారా?
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కారుదేనని హరీశ్‌రావు విమర్శించారు. రైతుల పంటను ప్రభుత్వమే కొనకపోతే వారికి దిక్కెవరు అని శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో విద్యారంగం అద్భుతమైన ప్రగతి
కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యా రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తేల్చిచెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా నివేదిక (2014--15 నుంచి 2024--25) బీఆర్‌ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి సాక్ష్యంగా నిలిచిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో జీరో డ్రాపౌట్స్ నమోదును నీతి ఆయోగ్ ప్రశంసించిందని, విద్యార్థుల నమోదులో ముఖ్యంగా బాలికల విద్యలో తెలంగాణ జాతీయ సగటును మించి రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు.






