9 May, 2026 | 2:34 AM

కృష్ణ జలాలతో కొడంగల్ సస్యశ్యామలం

09-05-2026 12:00 AM

ఏడాదిలో కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

రూ. 110 కోట్లతో కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన 

హాజరైన మంత్రులు దామోదర, వాకిటి శ్రీహరి

కొడంగల్, మే 8 (విజయక్రాంతి): కృష్ణ జలాలతో కొడంగల్‌ను సస్యశ్యామలం చేస్తామని, ఏడాదిలోనే కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్  తెలిపారు. పేదల తిరుపతిగా ఖ్యాతి పొందిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

వేద  పండితుల సమక్షంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సిహంహా, వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో కలిసి ఆగమ శాస్త్ర ప్రకారం భూమి పూజ చేశారు. అదేవిదంగా 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, కోస్గి మం డల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆల యం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడు తూ శిలాఫలకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ పట్టణంలో శ్రీ వెంక టేశ్వర స్వామి దేవాలయం తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ప్రజలకు కూడా పేదల తిరుపతిగా పేరుగాంచింది అన్నారు.

తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారో అదే విదంగా పూజలు కొడంగల్ దేవాలయంలో కూడా చేయాలని తెలిపారు. కొడంగల్ పేరు ప్రతిష్టను దేశస్థాయిలో నిలబెట్టడానికి ఇది ఎంతగానో ఉప యోగపడుతుందని సూచించారు. ఇది ఒక గొప్ప దైవ కార్యక్రమం అని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా నిలబడ్డానని, మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముం దుకు తీసుకెళ్తానని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలుపుతూ రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు.

రైతు రుణమాఫీ సన్న బియ్యం రైతు భరోసా ఇం దిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కొడంగల్‌లో విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారని ఇకనుంచి వలసలు ఆపి కొడంగల్‌లోనే విద్య, వైద్య సదుపాయాలు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలుపుతానని అన్నారు. కొడంగల్ కార్యకర్తల నాయకుల కష్టంతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేసి కృష్ణ నది జలాలు కొడంగల్‌కు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎత్తిపోతల పథ కానికి ఏ అడ్డంకులు రాకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి అధిక నిధు లు మంజూరు చేస్తున్నామని సీఎం అన్నా రు. వచ్చే ఏడాదిన్నర కాలంలో కొడంగల్ నియోజకవర్గానికి సిమెంట్ పరిశ్రమ ఏర్పా టు చేసి స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ సైనిక్ స్కూల్ ఇలా అన్ని విద్యాసంస్థలు కొ డంగల్‌లో ఏర్పాటు చేస్తామని అన్నారు. వికారాబాద్ రైల్వే లైన్ 90 శాతం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

2,300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును లగచర్ల దగ్గర ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా కొడంగల్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. 2027లోగా కొడంగల్‌లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఎం వో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామ య్యర్, వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి, నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రి యాంక, ప్రభుత్వ చెందిన ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.