12 April, 2026 | 3:45 AM

మున్సిపల్ ఫలితాలతో బాధ్యత మరింత పెరిగింది

19-02-2026 01:51 AM

ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మామీద బాధ్యత మరింత పెరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో రెండు మున్సిపాలిటీల్లో (చేర్యాల, తిరుమలగిరి) ఓడిపోయామన్నారు. మున్సిపాలిటీలలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఉండటంతో పాటు  అక్కడ ఉన్న నాయకులు కోవర్టులుగా మరారని ఆయన తెలిపారు.

బుధవారం ఆయన గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఓడిపోయిన మున్సిపాలిటీల్లో వాస్తవాలు తెలుసుకున్నాక పార్టీ ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష పాత్ర పోషించకుండా ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని, 2023 నుంచి ఆరుసార్లు కేసీఆర్ ఘోరంగా ఓటమి చెందారని విమర్శించారు.