19-02-2026 01:52:57 AM
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి 67శాతం బీసీవార్డు మెంబర్లు గెలిచారని, 87.5శాతం ఎస్సీ, ఎస్సీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 94 మున్సిపాలిటీలను గెలిచామంటే అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజలు సానుకూలతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.