calender_icon.png 19 February, 2026 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడ పార్టీకి మోసం చేశావో అక్కడే నీకు శాస్తి జరిగింది

19-02-2026 01:49:53 AM

మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ పార్టీకి గతంలో చీర చందర్ ఎక్కడ మోసం చేశాడో అక్కడే అతనికి దేవుడు తగిన శాస్తి విధించాలని వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....2014 లో జరిగిన చైర్మన్ ఎన్నిక ఇప్పటికీ నాయకులతోపాటు జిల్లా ప్రజలందరికీ గుర్తుందన్నారు.

టిడిపి పార్టీ నాయకులకు అమ్ముడుపోయిన చీర్ల చందర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా పార్టీకి తీవ్ర నష్టంతో పాటు మోసం చేశాడని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పార్టీలో ఉంటూనే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ఓడించాలని ప్రయత్నం చేయడం నిజం కాదా? అని నిలదీశారు. చీర్ల చందర్ పార్టీలోని సీనియర్ నాయకులను శోభకు గురిచేసి అవమానించేవాడని పేర్కొన్నారు.

అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. ఎమ్మెల్యే మెగా రెడ్డి లేకపోతే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదని, ఎమ్మెల్యే మేగారెడ్డి ఇస్తున్న మేఘన అభయహస్తం ఆర్థిక సహాయం లోను అవినీతికి పాల్పడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. చందర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే తో పాటు నాయకులను సైతం బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వ్యామోహంతో ఉండేవాడని, చందర్ ను తిరిగి పార్టీలోకి తీసుకుంటే మేమంతా పార్టీని వీడడానికి సైతం వెనుకాడమని తెగేసి చెప్పారు. చీర్ల చందర్ రాజీనామాను వెంటనే ఆమోదించాలని, అదేవిధంగా చీరల రజిని కౌన్సిలర్ సభ్యత్వానికి కూడా ఆమోదం లభిస్తే హర్షిస్తామని అన్నారు.

సాగర సంగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేదంటే హైదరాబాదులోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పుట్టపాకల మహేష్, బి కృష్ణ, బ్రహ్మచారి, పరశురాం, విజయలక్ష్మి, విభూది మహేశ్వరి, కదిరే రాములు, చీర్ల సత్యం సాగర్, చీర్ల జనార్ధన్, సహదేవుడు, కోళ్ల వెంకటేష్, సేవాదళ్ జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.