గిన్నిస్ రికార్డులో లక్షెట్టిపేట వాసులు
23-03-2026 08:55 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆధ్వర్యంలో ఆది వారం రాత్రి నిర్వహించిన శ్రీ వాసవి మాత పారాయణం గిన్నిస్ బుక్ రికార్డు కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు. 22 వేల మంది మహిళలతో ఈ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం నిర్వహించగా ఇందులో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉందని ఆర్య వైశ్యులు పేర్కొన్నారు.




