బీసీ డిక్లరేషన్ సబ్ ప్లాన్ తక్షణమే అమలు చేయాలి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతినిధుల నిరసన
కామారెడ్డి,(విజయక్రాంతి): బీసీ డిక్లరేషన్ సబ్ ప్లాన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. కామరెడ్డి బిసిడిక్లరేషన్ తో పాటు బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం చిన్నచూపు చూసిందన్నారు. 60 శాతం జనాభా గల బీసీలకు ఆరు శాతం బడ్జెట్ కేటాయించడం పట్ల బీసీల పట్ల ప్రభుత్వ తీరు ఇందుకు నిదర్శనం అన్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో రాజ్యాధికార పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధించిందన్నారు. 60 శాతం బీసీలకు రావాల్సిన వాటాను బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రతినిధులు త హెర్, నర్సింలు, వెంకటేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.




