23 March, 2026 | 11:22 PM

మర్తనపేటలో కోతుల సమస్యకు చెక్

23-03-2026 09:01 PM

– 90 కోతులను పట్టించి తరలించిన సర్పంచ్ దీపిక వెంకటేష్

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో కొంతకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల సమస్యకు గ్రామ సర్పంచ్ గాదపాక దీపిక వెంకటేష్ చర్యలు చేపట్టారు. గ్రామస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కోతులను పట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు సుమారు 90 కోతులను పట్టించి గ్రామం నుండి తరలించడం జరిగింది. కోతుల వల్ల ఇళ్లపై దాడులు, పంటలకు నష్టం, చిన్నపిల్లలకు భయం వంటి సమస్యలు తీవ్రంగా ఉండగా, ఈ చర్యలతో గ్రామస్తులు ఉపశమనం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది చురుకుగా పాల్గొని సర్పంచ్‌కు సహకరించారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.