3 June, 2026 | 4:09 PM

ప్రమాదంలో గాయపడిన సృజన్ కు మానవత్వాన్ని చాటిన CRP క్యాంపు వాస్తవ్యులు

03-06-2026 03:18 PM

* 27,500/- ల నగదును విరాళంగా సేకరించిన క్యాంప్ యువత 

* దాతృత్వాన్ని చాటుకున్న  క్యాంప్ దాతలు

కొత్తగూడెం,(విజయక్రాంతి): 15 రోజుల కిందట ఒక ప్రమాదంలో విపరీతంగా గాయపడిన CRP క్యాంపు నివాసి, సృజన్ ప్రస్తుతం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆపరేషన్ నిమిత్తం దాదాపు మూడు లక్షల ఖర్చు అవుతుందని తెలిసి, మర్రి కృష్ణ ఆధ్వర్యంలో సిఆర్పి క్యాంప్ యువత ముందుకు వచ్చి, తమ వంతు సహాయంగా క్యాంపులోని దాతల సహాయంతో 27,500/- (అక్షరాల ఇరవైఏడు వేల ఐదువందల రూపాయల) నగదు విరాళంగా వసూలు చేసి దాసరి అశోక్, హైదర్, నయీం పెద్దల సమక్షంలో సృజన్ మేనమామ ఉపేందర్ కు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ అలీ, జాన్ పాల్, మిల్కీ, గాంధీ  భరత్ బస్తివాసులు దాతలు పాల్గొన్నారు.