3 June, 2026 | 4:09 PM

నిర్మల్ కవికి సన్మానం

03-06-2026 03:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నగరానికి చెందిన తెలుగు,సంస్కృతం ప్రముఖపద్యకవి,సంస్కృభాషా ప్రచార సమితి ఆదిలాబాదు,నిజామాబాదు,కరీంనగర్,వరంగల్,మెదక్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా బి.వెంకట్ హైదరబాదులో రాష్ట్ర సాహితీ సన్మానమును అందుకున్నారు. త్యాగరాయగానసభ, తెలంగాణరాష్ట్రభాషా సాంస్కృతికశాఖ సంయుక్తనిర్వహణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని చిక్కడపల్లిలోగల కళాలలిత కళావేదికలో జరిగిన ప్రపంచ శాంతి అను కవిసమ్మేళనములో నిర్వాకులు సన్మానం శ్రీత్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా విఎస్ జనార్ధన్ మూర్తి, తెలుగు రాష్ట్రాల జ్ఞాన మహాయజ్ఞం  కేంద్రం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక పుస్తకాల రచయిత పురాణపండ శ్రీనివాస్, సినీగేయకవి మౌనశ్రీ మల్లిక్, రక్షణశాఖ విశ్రాంత ఉద్యోగి, సభాసంధానకర్త పెద్దూరి వెంకటదాసు,ప్రముఖ కవయిత్రి శైలజామిత్ర ఈ కార్యక్రమంలో సన్మానం చేసినట్టు ఆయన తెలిపారు. అనుమానం అందుకున్న కవికి నిర్మల్ కవులు అభినందనలు తెలిపారు.